Karthi: తెలుగులో రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టిన 'ఖైదీ'
- తమిళంలో హిట్ కొట్టిన కార్తీ
- తెలుగులోను భారీ వసూళ్లు
- ఈ ఏడాదిలో కార్తీకి భారీ హిట్ ఇచ్చిన 'ఖైదీ'
కార్తీ హీరోగా తమిళంలో రూపొందిన 'ఖైదీ' అక్టోబర్ 25వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదలైంది. అంతకుముందు కార్తీ చేసిన సినిమాలన్నీ పరాజయంపాలు కావడంతో, ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అలాంటి ఈ సినిమా మౌత్ టాక్ తో ఊపందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 3.5 కోట్లకి అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఫుల్ రన్లో 7.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇలా పెట్టుబడికి రెట్టింపు లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా 'ఖైదీ' నిలిచింది. కార్తీని ఆయన అభిమానులను ఈ సినిమా ఫుల్ ఖుషీ చేసింది. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తో సినిమాలు చేయడానికి అక్కడి స్టార్ హీరోలు పోటీపడుతున్నారు. మొత్తానికి ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను ఈ ఏడాది కార్తీకి మంచి హిట్ పడింది.