'నిశ్శబ్దం' నుంచి షాలినీ పాండే లుక్
- చిత్రకారిణి పాత్రలో అనుష్క
- వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
తాజాగా ఈ సినిమా నుంచి షాలినీ పాండే లుక్ ను వదిలారు. భయం .. బాధ .. ఆందోళనతో కూడిన ఆమె లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ఈ సినిమాలో 'సోనాలి' అనే పాత్రలో కనిపించనుందనే విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారా తెలియపరిచారు. ఇతర ముఖ్య పాత్రల్లో మైఖేల్ మాడ్సన్ .. అంజలి .. అవసరాల .. సుబ్బరాజు కనిపించనున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, వివిధ భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.