లాంఛనంగా మొదలైన 'రంగమార్తాండ'
- మరాఠీలో విజయవంతమైన 'నట సామ్రాట్'
- కృష్ణవంశీ దర్శకుడిగా తెలుగు రీమేక్
- కీలకమైన పాత్రలో బ్రహ్మానందం
అందువల్లనే ఈ సినిమాను కృష్ణవంశీ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మధు - అభిషేక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఈ రోజున లాంఛనంగా ఆరంభించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. కీలకమైన పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నారు. బ్రహ్మానందం లుక్ కొత్తగా ఉండటమే కాదు, ఈ సినిమాలో ఆయన పాత్ర కన్నీళ్లు పెట్టిస్తుందని చెబుతున్నారు.