'96' మూవీ రీమేక్ కి విడుదల తేదీ ఖరారైపోయినట్టే
- తమిళంలో ప్రశంసలు అందుకున్న '96'
- తెలుగు రీమేక్ లో శర్వానంద్ - సమంత
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్, తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయాలని భావించారు. అయితే ఆ రోజున విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ఉండటంతో. '96' రీమేక్ ను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.