యంగ్ హీరోతో 'మజ్ను' దర్శకుడు
- 'ఉయ్యాలా జంపాలా'తో హిట్
- 'మజ్ను'తో మరింత గుర్తింపు
- రాజ్ తరుణ్ ను లైన్లో పెడుతున్న విరించి వర్మ
వాస్తవానికి కల్యాణ్ రామ్ హీరోగా విరించి వర్మ ఒక సినిమా చేయవలసి వుంది. తన కమిట్మెంట్స్ పూర్తయ్యేలోగా మరో సినిమా చేసుకుని రమ్మని కల్యాణ్ రామ్ చెప్పాడు. దాంతో వరుణ్ తేజ్ కి విరించి వర్మ ఒక కథ వినిపించాడు. అయితే ఈ కథకి సంబంధించి వరుణ్ తేజ్ ఇంతవరకూ తన అభిప్రాయం చెప్పలేదట. ఒకవేళ వరుణ్ తేజ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే రాజ్ తరుణ్ తో సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో విరించి వర్మ ఉన్నాడని చెబుతున్నారు. ఆ దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టేశాడని అంటున్నారు. ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువనే చెప్పుకుంటున్నారు.