'రంగమార్తాండ' చిత్రంలో బ్రహ్మానందం లుక్ చూశారా... మనసులు కదిలించే పాత్ర అంటున్న కృష్ణవంశీ!
- మరాఠీ చిత్రానికి రీమేక్ గా రంగమార్తాండ
- ప్రధానపాత్రల్లో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ
- కీలకపాత్రలో బ్రహ్మానందం
సాధారణంగా బ్రహ్మీ ఉన్నాడంటే అందులో నవ్వులకు కొదవ ఉండదు. కానీ రంగమార్తాండ చిత్రంలో ఆయన పాత్ర మనసులు కదిలించే విధంగా ఉంటుందని దర్శకుడు కృష్ణవంశీ చెబుతున్నాడు. నటన నుంచి తప్పుకున్న ఓ నాటకరంగ నటుడి విషాదకర జీవితమే రంగమార్తాండ స్టోరీ. ఇందులో బ్రహ్మానందం పాత్ర కూడా అలాంటిదే! తాజాగా విడుదలైన ఆయన లుక్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది.