ఓ హీరో నా వద్ద ఆ ప్రపోజల్ తీసుకొచ్చాడు.. కుదరదని చెప్పా!: రకుల్ ప్రీత్ సింగ్
- క్యాస్టింగ్ కౌచ్ నాక్కూడా ఎదురైంది
- ఓ స్టార్ హీరో శృంగారం కోసం ప్రపోజ్ చేశాడు
- అలాంటివి నాకు సరిపోవని చెప్పా
క్యాస్టింగ్ కౌచ్ తనకు ఎదురు కాలేదని చెబితే అది అబద్ధమే అవుతుందని రకుల్ తెలిపింది. ఓ స్టార్ హీరో తనతో శృంగారం కోసం ప్రపోజ్ చేశాడని చెప్పింది. అయితే, ఎంతో మర్యాద పూర్వకంగా తనను అడిగాడని తెలిపింది. ఆయన మాట వినగానే తనకు చాలా కోపం వచ్చిందని... అయితే, అలాంటివి తనకు సరిపోవంటూ తాను చాలా కూల్ గా చెప్పానని వెల్లడించింది. అయితే, ఆ హీరో ఎవరో మాత్రం రకుల్ చెప్పలేదు.