మళ్లీ 'సాహో' నిర్మాతలతోనే సుజీత్!
- 'రన్ రాజా రన్' తో తొలి హిట్
- 'సాహో'తో మంచి గుర్తింపు
- శర్వానంద్ తో సినిమాకి సన్నాహాలు
ఇక శర్వానంద్ కోసం సుజీత్ ఒక కథను సిద్ధం చేసుకున్నాడనీ, త్వరలోనే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కనుందనే టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమాను నిర్మించేది కూడా యూవీ క్రియేషన్స్ వారేననేది తాజా సమాచారం. సుజీత్ తొలి సినిమా అయిన 'రన్ రాజా రన్'.. రెండవ సినిమా అయిన 'సాహో'ను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వారే శర్వానంద్ సినిమాను కూడా నిర్మిస్తుండటం విశేషం.