గుడిలోని అమ్మవారికి నమస్కరించి.. కిరీటం చోరీ చేసిన భక్తుడు
- హైదరాబాద్ గన్‌ఫౌండ్రీలోని దుర్గాభవానీ ఆలయంలో ఘటన
- సీసీటీవీ కెమెరాలో రికార్డు
- 35 తులాల వెండితో చేసిన కిరీటం
బుధవారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి కుంకుమ బొట్టు తీసి పెట్టుకున్నాడు. అనంతరం చుట్టూ చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత అమ్మవారికి తలపై ఉన్న వెండి కిరీటాన్ని తీసి సంచిలో వేసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత ఆలయానికి వచ్చిన పూజారి కిరీటం చోరీ అయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిరీటాన్ని 35 కిలోల వెండితో చేసినట్టు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.