విజయ్ దేవరకొండకు దిశానిర్దేశం చేసే పాత్రలో రమ్యకృష్ణ
- పూరి దర్శకత్వంలో రూపొందనున్న 'ఫైటర్'
- మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే కథ
- జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ఎలా వుండనుందోననే ఆసక్తి అభిమానుల్లో చోటుచేసుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి దిశానిర్దేశం చేసే కీలకమైన పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. ఆమె సూచనలమేరకే తన రూటు మార్చుకుని, మార్షల్ ఆర్ట్స్ లో ఎదుగుతాడని చెబుతున్నారు. కథా పరంగా విజయ్ దేవరకొండను మందలిస్తూ .. హెచ్చరిస్తూ ఆయనను ముందుకు నడిపించే రమ్యకృష్ణ పాత్ర, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.