శ్రీదేవి గురించి మాట్లాడలేక కన్నీటిపర్యంతమై ప్రసంగం వెంటనే ఆపేసిన బోనీకపూర్!
- హైదరాబాద్ లో ఏఎన్నార్ అవార్డుల కార్యక్రమం
- శ్రీదేవికి ఈ ఏడాది అక్కినేని అవార్డు ప్రకటన
- తీసుకునేందుకు వచ్చిన బోనీకపూర్
ఓవైపు శ్రీదేవి స్మృతులు ఆయన కళ్లలో సుడులు తిరుగుతుంటే ఒక్క ముక్క మాట్లాడలేక కన్నీటిపర్యంతమయ్యారు. దాంతో సభకు విచ్చేసిన పెద్దలు అంటూ టి.సుబ్బరామిరెడ్డి, నాగార్జున, చిరంజీవి తదితరులకు ధన్యవాదాలు తెలిపి గద్గద స్వరంతో ఇక తనవల్ల కాదంటూ ప్రసంగం ఆపేశారు. అంతకుముందు బోనీకపూర్ కు చిరంజీవి శాలువా కప్పి మెమెంటో, ప్రశంసాపత్రం అందించారు.