అప్పట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అంజలీదేవి ముఖం కొంతవరకూ కాలిపోయిందట
- అవి అంజలీదేవి కెరియర్ ఊపందుకుంటున్న రోజులు
- తమిళంలోను ఆమెకి అవకాశాలు పెరుగుతున్నాయి
- అలాంటి పరిస్థితుల్లోనే ప్రమాదం జరిగిందన్న ఈశ్వర్
"తెలుగు .. తమిళ భాషల్లో అంజలీదేవి కెరియర్ ఊపందుకుంటున్న రోజులవి. ఒక తమిళ సినిమాలో ఆమె మంటల్లో చిక్కుకునే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ప్లానింగులో తేడా రావడంతో నిజంగానే ఆమె ఆ మంటల్లో చిక్కుకున్నారు. దాంతో ఆమె ముఖం కొంతవరకూ కాలిపోయింది. ఇక అంజలీదేవి కెరియర్ ముగిసినట్టే అనే గుసగుసలు మొదలయ్యాయి. కానీ విదేశాల నుంచి వైద్యులను రప్పించి .. మందులు తెప్పించి మూడు నెలల పాటు చికిత్స చేయిస్తూ రావడం వలన తిరిగి ఆమె మామూలు మనిషి అయ్యారు. ఒక రకంగా ఈ సంఘటన ఆమె జీవితంలో ఒక మరిచిపోలేని మలుపు అనే అనాలి" అని చెప్పుకొచ్చారు.