యాక్సిడెంట్ తరువాత నా కెరియర్ మళ్లీ మొదటికొచ్చింది: 'రోజాపూలు' హీరో శ్రీరామ్
- 'రోజాపూలు' మంచి పేరు తెచ్చింది
- 'ఒకరికి ఒకరు' మ్యూజికల్ హిట్
- అప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయాల్సి వచ్చిందన్న శ్రీరామ్
అలా తమిళంతో పాటు తెలుగులోను నేను బిజీ అవుతానని అనుకుంటూ ఉండగానే నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. రెండు సంవత్సరాల పాటు నేను సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ ప్రమాదం తరువాత కెరియర్ మళ్లీ మొదటికొచ్చింది. అంతకుముందు నాతో సినిమాలు చేస్తామంటూ తిరిగిన వాళ్లెవరూ నన్ను పట్టించుకోలేదు. దాంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వెళ్లాను. ఇప్పుడు మాత్రం హీరో అవకాశాలకు .. కీలకమైన పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.