నాలుగు భాషల్లో ఒకే రోజున రానున్న 'మమాంగమ్'
- భారీ చారిత్రక చిత్రంగా 'మమాంగమ్'
- మమ్ముట్టి కెరియర్లోనే అత్యధిక బడ్జెట్
- డిసెంబర్ 12వ తేదీన విడుదల
మలయాళంలో మమ్ముట్టి కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమైందని అంటున్నారు. మలయాళంతో పాటు తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నాలుగు భాషల్లోను డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. అత్యధిక థియేటర్స్ లో విడుదల కానున్న ఈ సినిమా, మమ్ముట్టి కెరియర్లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.