ధనుశ్ మూవీ విడుదల తేదీ ఖరారు
- గౌతమ్ మీనన్ నుంచి కొత్త సినిమా
- ధనుశ్ జోడీ కట్టిన మేఘా ఆకాశ్
- కీలకమైన పాత్రలో రానా
ఇటీవల ధనుశ్ చేసిన 'అసురన్' రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది. ఆ సినిమా ప్రభావం సహజంగానే తదుపరి సినిమాపై ఉంటుంది. అందువలన గౌతమ్ మీనన్ 'ఎన్నై నోకి పాయుమ్ తూటా' సినిమాను రంగంలోకి దింపుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి. మేఘా ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో రానా కనిపించనున్నాడు.