'90 ఎమ్.ఎల్' విడుదల తేదీ ఖరారు
- కార్తికేయ తాజా చిత్రంగా '90ML'
- అజర్ బైజాన్ లో 3 పాటల చిత్రీకరణ
- డిసెంబర్ 5వ తేదీన విడుదల
ఈ పోస్టర్ లోని కార్తికేయ యాక్షన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, "ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం ఈ సినిమా షూటింగును పూర్తి చేశాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరో హీరోయిన్ల కాంబినేషన్లో వచ్చే 3 రొమాంటిక్ సాంగ్స్ ను 'అజర్ బైజాన్'లో చిత్రీకరించాము. ఈ మూడు పాటలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇది కార్తికేయకి గల క్రేజ్ కి .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమా అవుతుంది" అని చెప్పుకొచ్చారు.