క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో కార్తీ నుంచి రానున్న 'తంబి'
- ప్రధాన పాత్రధారులుగా కార్తీ - జ్యోతిక
- దర్శకుడిగా జీతూ జోసెఫ్
- డిసెంబర్ 20న విడుదల చేసే ఆలోచన
కార్తీ .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, 'తంబి' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు సమాచారం. 'దృశ్యం' మలయాళ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. అందువలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. సత్యరాజ్ .. అభిరామి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, తెలుగులోను విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు.