Mahesh Babu: అమ్మ కంటే మిన్నగా మరెవరు చూసుకుంటారు?: టాలీవుడ్ ఎంట్రీ సందర్భంగా మహేశ్ మేనల్లుడు ట్వీట్
- టాలీవుడ్ కు పరిచయం అవుతున్న అశోక్ గల్లా
- ఈ నెల 10న సినిమా ప్రారంభం
- ఎంతో ఉద్విగ్నంగా ఉంది అంటూ అశోక్ స్పందన
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అశోక్ గల్లా మహేశ్ బాబు సోదరి పద్మావతి, ఎంపీ గల్లా జయదేవ్ ల తనయుడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంతో అశోక్ గల్లా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు అశోక్ తల్లి పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10న సినిమా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అశోక్ గల్లా ట్వీట్ చేశాడు. "తల్లి కంటే మిన్నగా మన బాగోగులు చూసుకునేవాళ్లు ఇంకెవరుంటారు? థాంక్యూ అమ్మా, నా కలను నిజం చేస్తున్నావు. థాంక్యూ కెప్టెన్ శ్రీరామ్ ఆదిత్య, ఎంతో ఉద్విగ్నంగా ఉంది" అంటూ తన స్పందన వెలిబుచ్చాడు.