పాట చిత్రీకరణతో మొదలుకానున్న చిరూ మూవీ షూటింగ్
- చిరూ 152వ సినిమాకి సన్నాహాలు
- ప్రాచీన దేవాలయాల నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా తెరపైకి 'త్రిష' పేరు
ఇది ప్రాచీన దేవాలయాల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ అని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండనున్నారు. ఒక కథానాయికగా 'త్రిష' పేరు వినిపిస్తోంది. మరో కథానాయిక ఎంపిక జరగవలసి వుంది. ఓ ముఖ్యమైన పాత్రలో ఈషా రెబ్బా కనిపించనుందని కూడా చెప్పుకుంటున్నారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటిస్తారట.