'విక్రమార్కుడు' తరహా పోలీస్ ఆఫీసర్ గా రవితేజ
- గోపీచంద్ మలినేనితో రవితేజ
- ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా
- రవితేజ జోడీగా శ్రుతిహాసన్
తాజా చిత్రంలో మాత్రం కామెడీ అనేది ఉండదట. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్న ఈ సినిమా, పూర్తి యాక్షన్ మూవీగా సాగుతుందని సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే, 'విక్రమార్కుడు' సినిమాలో మాదిరిగా ప్రతినాయకుడు ఎంతటివాడైనా కొమ్ములు వంచే ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ జోడీగా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.