కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడం కోసమే 'లాంగ్ మార్చ్': నాగబాబు
- ఓదార్పు యాత్ర చేసిన నేతకు కార్మికుల సమస్యలు తెలియవా? అంటూ ఆగ్రహం
- భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు కలచివేశాయన్న నాగబాబు
- పవన్ కు సామాజిక స్పృహ ఎక్కువని వెల్లడి
తన సోదరుడు పవన్ కల్యాణ్ కు సామాజిక స్పృహ ఎక్కువని, సమస్యలపై స్పందించే వ్యక్తి అని తెలిపారు. భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం చాలా బాధ కలిగించిందని నాగబాబు పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటాన్ని మన కోసం మనం చేసే పోరాటంగా భావించాలని పిలుపునిచ్చారు.