గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన కళాతపస్వి కె.విశ్వనాథ్... కేసీఆర్, సంతోష్ లపై ప్రశంసల జల్లు
- హరితహారం అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
- తన ఇంట్లోనూ ఓ మొక్క నాటిన కె.విశ్వనాథ్
- పర్యావరణం కోసం కృషి చేస్తున్నారంటూ కేసీఆర్, సంతోష్ లకు అభినందన
ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ లను అభినందించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ ఇద్దరూ విశేష కృషి చేస్తున్నారని, ముఖ్యంగా సంతోష్ ఈ కార్యక్రమాన్ని ఓ భగీరథ ప్రయత్నంలా సాగిస్తున్నారని కొనియాడారు. పర్యావరణం నానాటికీ దెబ్బతింటున్న ఈ రోజుల్లో హరితహారం ఎంతో గొప్ప కార్యక్రమం అని కె.విశ్వనాథ్ ప్రశంసించారు.