పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న అంజలి
- అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం'
- అమెరికా నేపథ్యంలో సాగే కథ
- హైలైట్ గా నిలవనున్న అంజలి రోల్
కథ ప్రకారం ఈ సినిమా షూటింగు చాలావరకూ అమెరికాలో జరిగింది. అక్కడి పోలీస్ ఆఫీసర్ గా అంజలి కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అంజలి గట్టిగానే కసరత్తు చేసి బరువు తగ్గిందని అంటున్నారు. ఈ తరహా పాత్రలో అంజలి కనిపించనుండటం ఇదే మొదటిసారి. ఆమె పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో మాధవన్ .. అవసరాల .. సుబ్బరాజు .. షాలినీ పాండే కనిపించనున్నారు.