విడుదలకి సిద్ధమైన 'మీకు మాత్రమే చెప్తా'
- హీరోగా కొత్త లుక్ తో తరుణ్ భాస్కర్
- నిర్మాతగా విజయ్ దేవరకొండ ప్రయోగం
- తెలుగు తెరకి వాణి భోజన్ పరిచయం
సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను, నవంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. హీరోగా స్టార్ డమ్ ను అందుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఒక విశేషమైతే, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా చేయడం మరో విశేషం. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.