150 కోట్ల క్లబ్ లోకి ధనుశ్ 'అసురన్'
- వెట్రి మారన్ నుంచి వచ్చిన 'అసురన్'
- విభిన్నమైన పాత్రలో ధనుశ్
- వసూళ్ల పరంగా కొత్త రికార్డులు
కోలీవుడ్ సినీ ప్రముఖులే కాదు .. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా వేగంగా ఈ సినిమా 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ధనుశ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ధనుశ్ కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకం అని అభిమానులు కితాబునిస్తున్నారు. దీపావళికి విజయ్ .. కార్తీ సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాల పోటీని 'అసురన్' ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందో చూడాలి.