'విజిల్' సెన్సార్ పూర్తి.. విడుదలకి సిద్ధం
- విజయ్ నుంచి ద్విభాషా చిత్రం
- క్రీడా నేపథ్యంలో సాగే కథ
- రేపే ప్రేక్షకుల ముందుకు
తెలుగు వెర్షన్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ సినిమా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఆల్రెడీ అట్లీ కుమార్ - విజయ్ కాంబినేషన్లో రెండు హిట్లు పడటం .. ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుండటం .. కథానాయిక నయనతార కావడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.