ఈ నెల 29న సౌదీ పర్యటనకు మోదీ
- ఎఫ్ఐఐ వార్షిక సదస్సులో పాల్గొననున్న ప్రధాని
- పర్యటనలో ద్వైపాక్షిక అంశాలపై చర్చలకు అవకాశం
- భారత్ లో సౌదీ పెట్టుబడులపై నిర్ణయం
ఈ పర్యటనలో ఇరుదేశాల నేతలు భేటీ కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్ సందర్శించిన సమయంలో పెట్రో కెమికల్స్, మౌలిక సదుపాయాలు, మైనింగ్ రంగాల్లో భారత్ లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.