మహేశ్ సినిమా నుంచి దీపావళికి విజయశాంతి ఫస్టులుక్
- హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి
- రాజకీయాల కారణంగా సినిమాలకి దూరం
- 13 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ
ఈ సినిమాలో ఆమె రాయలసీమకి చెందిన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి విజయశాంతి లుక్ ఎలా వుండనుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ రోజున ఆమె ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. మహేశ్ బాబు .. రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.