మా సినిమా ద్వారానే రజిత పరిచయమైంది: పరుచూరి గోపాలకృష్ణ
- 'అగ్నిపుత్రుడు' సమయంలో రజితను చూశాను
- చిన్నపిల్లగా తన కెరియర్ ను మొదలెట్టింది
- అంచలంచెలుగా ఎదిగిందన్న గోపాలకృష్ణ
అలా ఇండస్ట్రీకి పరిచయమైన రజిత, నాకు తెలిసి 500 సినిమాలకి పైగా చేసి ఉంటుంది. ఒక గిరిజ .. గీతాంజలి .. రమాప్రభ బాటలో ఆ తరహా వేషాలు వేస్తూ వెళుతుందని నేను భావించాను. కానీ ఆ అమ్మాయి తను ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించింది. కామెడీ పాత్రలను ఎక్కువగా చేసిన రజిత, 'అడవిలో అన్న' సినిమాలో కంటతడి పెట్టించే పాత్రలోనూ మెప్పించింది. ఆ తరువాత తనకి నంది అవార్డు వచ్చినట్టుగా ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.