'మా' తరఫున ఎలాంటి సభలు జరిగినా అధ్యక్ష స్థానంలో నేనే ఉండాలి: నరేశ్ స్పష్టీకరణ
- నిన్న హైదరాబాద్ లో 'మా' స్నేహపూర్వక సమావేశం
- రసాభాసగా ముగిసిన సమావేశం!
- స్పందించిన 'మా' అధ్యక్షుడు నరేశ్
సమావేశానికి హాజరు కావాలంటూ 25 రోజుల క్రితం తనకు ఓ లేఖ వచ్చిందని వెల్లడించారు. అధ్యక్షుడిగా జనరల్ బాడీ సమావేశానికి సభ్యులను ఆహ్వానించాల్సింది తానేనని, కానీ తనను మరెవరో పిలవడం ఏంటని ఆ సమయంలో ఆశ్చర్యపోయానని నరేశ్ వివరించారు. తాను అధ్యక్షుడ్నైన ఆరు నెలల్లో ఒకసారి సమావేశం నిర్వహించానని, మూడు ఎగ్జిక్యూటివ్ సమావేశాలు కూడా నిర్వహించానని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిన మీటింగ్ పై అనుమానాలు ఉండడంతో హాజరు కాలేదని తెలిపారు.