రేవంత్ రెడ్డి అరెస్ట్.. ప్రగతి భవన్ గోడలు బద్దలుకొడతామన్న రేవంత్
- బైక్ పై ప్రగతి భవన్ వద్దకు వచ్చిన రేవంత్
- అదుపులోకి తీసుకుని, తరలించిన పోలీసులు
- ప్రగతి భవన్ గేట్లను తాకుతామని చెప్పి.. తాకామన్న రేవంత్
ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ నశించాలి అంటూ నినదించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని, ప్రాణాలు అర్పించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను సవాల్ చేస్తూ ప్రగతి భవన్ గేట్లను తాకుతామని ఛాలెంజ్ చేసి తాకామని చెప్పారు. రేపు కేసీఆర్ ప్రగతి భవన్ గోడలను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు.