'అల వైకుంఠపురములో' కీలక పాత్ర పోషిస్తున్న సుశాంత్.. ఫస్ట్ లుక్ ఇదిగో!
- త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
- సుశాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం
- జనవరి 12న రిలీజ్
బన్నీ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక కాగా, నివేదా పేతురాజ్ మరో ముఖ్యపాత్ర పోషిస్తోంది. సీనియర్ నటి టబు దశాబ్దకాలం తర్వాత ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది.