'ఆదిత్య అరుణాచలం'గా కనిపించనున్న రజనీ
- ముగింపు దశలో 'దర్బార్' మూవీ
- రజనీ కూతురు పాత్రలో నివేద థామస్
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, రజనీ కూతురు పాత్రలో నివేద థామస్ కనిపించనుంది. 'ఒకే ఒక్కడి గురించి ఈ ప్రపంచం తెలుసుకోవలసిన సమయం వచ్చింది .. ఆయనే మా నాన్న .. ఆదిత్య అరుణాచలం' అంటూ 'దర్బార్ ' సినిమాలో రజనీ పాత్ర పేరును రివీల్ చేసింది. తను ఆయన కూతురు పాత్రలో చేస్తున్న విషయాన్ని స్పష్టం చేసింది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ చేస్తున్న ఈ సినిమా, ఆయన కెరియర్లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.