గోపీచంద్ పై 'చాణక్య' ఫ్లాప్ ప్రభావం
ఇటీవల గోపీచంద్ నుంచి వచ్చిన 'చాణక్య' భారీ పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఆ సినిమా నిర్మాత నష్టాలపాలయ్యారు. ఈ ప్రభావం కారణంగానే, గోపీచంద్ తో చేయాలనుకున్న ప్రాజెక్టును భోగవిల్లి ప్రసాద్ రద్దు చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు గోపీచంద్ చేతిలో సంపత్ నంది సినిమా మాత్రమే వుంది. అది కూడా భారీ బడ్జెట్ తో కూడినదే. ఈ నేపథ్యంలో ఏ తరహా కథలను తన నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్నారనే విషయంపైనే గోపీచంద్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడట.