నకిలీ ఐడీ సృష్టించారంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు!
- ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ ఐడీ
- 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు
- పీటీ వారెంట్ ద్వారా మియాపూర్ కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు
కాగా, నిన్న కూడా రవి ప్రకాశ్ పై ఓ కేసు నమోదయింది. ఆయనకు చెందిన వెబ్ ఛానెల్స్‌లో తనపై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేయడంతో... రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌పై తాను ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినప్పటికీ, ఫిర్యాదు చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని రామారావు ఆరోపించారు.