కృష్ణవంశీ దర్శకుడిగా 'రంగమార్తాండ'!
- మరాఠీలో హిట్ కొట్టిన 'నటసామ్రాట్'
- నానాపటేకర్ పాత్రలో ప్రకాశ్ రాజ్
- చాలాకాలం తరువాత భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ
2016లో వచ్చిన మరాఠీ సినిమా 'నటసామ్రాట్'కి రీమేక్ గా కృష్ణవంశీ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'రంగమార్తాండ' అనే టైటిల్ ను ఖరారు చేసి, అధికారిక పోస్టర్ ను వదిలాడు. మరాఠీలో నానాపటేకర్ చేసిన పాత్రలో ప్రకాశ్ రాజ్ .. ఆయన సరసన రమ్యకృష్ణ నటించనున్నారు. అభిషేక్ - మధు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 'శ్రీఆంజనేయం' తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది