'రొమాంటిక్' సినిమాలో పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ
- షూటింగు దశలో 'రొమాంటిక్'
- కథానాయికగా కేతిక శర్మ పరిచయం
- రమ్యకృష్ణ పాత్రను గొప్పగా డిజైన్ చేసిన పూరి
ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారనేది తాజా సమాచారం. 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలోని పాత్ర తరహాలో ఆమె ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. సినిమా అంతా రమ్యకృష్ణ కనిపిస్తారనీ, ఆమె పాత్రను పూరి గొప్పగా డిజైన్ చేశాడని చెప్పుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల జాబితాలో ఈ పాత్ర కూడా చేరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.