ఈ చిన్నారి సీతమ్మ డ్యాన్స్ ఎంత క్యూటో... ఫిదా అవుతున్న నెటిజన్లు!
- దసరా సందర్భంగా చిన్నారులకు వేషాలు
- మ్యూజిక్ కు అనుగుణంగా పాప నృత్యం
- పొగడ్తలు కురిపిస్తున్న నెటిజన్లు
ఈ ముచ్చట ఎక్కడ జరిగిందన్న విషయం తెలియలేదుగానీ, ఏ మాత్రం కల్మషం లేకుండా, అమాయకత్వంతో ఈ చిన్నారి సీత నృత్యం చేస్తుండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన వారంతా పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ కాలపు సీతమ్మ డ్యాన్స్ చేస్తే ఇలాగే ఉంటుందని కితాబిస్తున్నారు. ఎంతో క్యూట్ గా డ్యాన్స్ చేసిందని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.