సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ముంబై షెడ్యూల్ పూర్తి చేసిన కీర్తి సురేశ్
- వెబ్ సీరీస్ లో నటిస్తున్న హన్సిక
- 'నేను రెడీ' అంటున్న బాలీవుడ్ హీరో
* గతంలో 'పిల్ల జమీందారు', 'భాగమతి' వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు అశోక్ ఇప్పుడు వెబ్ సీరీస్ నిర్మాణంలో బిజీగా వున్నాడు. ఈ క్రమంలో తను రూపొందిస్తున్న ఓ వెబ్ సీరీస్ లో ప్రముఖ కథానాయిక హన్సికను ప్రధాన పాత్రకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సీరీస్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
* 'తెలుగు సినిమాలలో చేయడానికి నేను రెడీ' అంటున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. 'హౌస్ ఫుల్ -4' చిత్రం ప్రచార కార్యక్రమాల కోసం హైదరాబాదుకు వచ్చిన అక్షయ్ మీడియాతో మాట్లాడుతూ, 'తెలుగు సినిమాలలో నటించాలని వుంది. భాష రాకపోయినా నేర్చుకుంటాను. ఎవరైనా అవకాశం ఇస్తే నేను రెడీ' అని చెప్పాడు.