రవిప్రకాశ్ పై సీజేఐకు విజయసాయిరెడ్డి లేఖ రాయడంపై కనకమేడల విమర్శలు
- సీజేఐకు లేఖ రాసే నైతిక అర్హత విజయసాయికి లేదు
- జగన్ అక్రమాలు ఎండగట్టారన్న కక్షతోనే ఈ లేఖ
- మనీ లాండరింగ్ కంపెనీలకు ఆద్యుడు విజయసాయిరెడ్డి
జగన్ అక్రమాలు ఎండగట్టారన్న కక్షతోనే బ్లాక్ మెయిల్ లేఖలు రాశారని ఆరోపించారు. మనీ లాండరింగ్, సూట్ కేసు కంపెనీలకు ఆద్యుడు విజయసాయిరెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రవిప్రకాశ్ సమస్య టీవీ9 పాత, కొత్త యాజమాన్యాల మధ్య నెలకొన్న సమస్య అని, ఆ వ్యవహారంలో ఏ2 రెడ్డి రాజకీయ జోక్యమెందుకు? అంటూ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఈ లేఖ చూస్తే టీవీ9కు విజయసాయిరెడ్డి స్లీపింగ్ పార్టనరా? అనే అనుమానం కలుగకమానదని అన్నారు.