దసరా కానుకగా మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' స్పెషల్ పోస్టర్ విడుదల
- షూటింగ్ దశలో 'సరిలేరు నీకెవ్వరు'
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు
- ఫ్యాన్స్ కు హ్యాపీ దసరా చెప్పిన మహేశ్
ఆ పోస్టర్ లో కర్నూలు కొండారెడ్డి బురుజు బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుండగా, ఆర్మీ ప్యాంట్ పైన క్యాజువల్ షర్ట్ ధరించిన మహేశ్ చేతిలో గొడ్డలితో రౌద్రం ప్రదర్శిస్తున్నాడు. మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. "హ్యాపీ దసరా" అంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.