ఉగ్రరూపంలో దర్శనమిస్తున్న అమ్మలగన్నయమ్మ!
- నేడు మహర్నవమి
- సింహవాహనంపై మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ
- కిటకిటలాడుతున్న ఆలయాలు
ఇక దసరా పర్వదినాల్లో రెండో రోజైన నేడు, తెలుగు రాష్ట్రాల్లోని వేలాది దేవాలయాలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. నేడు ఆయుధపూజ కూడా ఉండటంతో, ఆలయాల వద్ద సందడి నెలకొంది. తమతమ వాహనాలను దేవాలయాల వద్దకు తీసుకు వచ్చిన భక్తులు, వాటిని అలంకరించి, పూజలు చేయిస్తున్నారు. ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ ఉదయం విజయవాడ, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునే సామాన్య భక్తులకు దర్శనానికి 3 గంటల వరకూ సమయం పడుతుండగా, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని దర్శించుకునేందుకు గంటన్నర వరకూ సమయం పడుతోంది.