గోపీచంద్ లో అప్పుడు ధైర్యం చూశాను .. ఇప్పుడు నమ్మకం చూస్తున్నాను: దర్శకుడు తిరు
- 'స్పై' చేపట్టే ఆపరేషన్ గా 'చాణక్య'
- అక్కడ గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు
- ఆ సమయంలో ఆయన చాలా ధైర్యంగా వున్నాడన్న 'తిరు'
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "గోపీచంద్ తో ఒక యాక్షన్ మూవీ చేయాలనే కోరిక నాకు ఈ సినిమాతో తీరింది. ఒక 'స్పై' చేపట్టే ఆపరేషన్ గా ఈ కథ సాగుతుంది. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. జైపూర్ కి 250 కిలోమీటర్ల దూరంలో షూటింగు జరుపుతుండగా, ఛేజింగ్ సీన్ లో బైక్ పై నుంచి గోపీచంద్ పడిపోయారు.
ఫస్టు ఎయిడ్ చేయించి ఆయనను జైపూర్ తీసుకెళ్లాము. పెద్ద గాయమైనప్పటికీ బాధను భరిస్తూ ఆయన నిబ్బరంగానే వున్నారు. ఆ సమయంలో ఆయనలో ధైర్యం చూశాను. ఇప్పుడు ఈ సినిమా విడుదల సమయంలో ఆయనలో నమ్మకం చూస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే బలమైన నమ్మకంతో ఆయన వున్నారు" అని చెప్పుకొచ్చాడు.