గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
- ఇది గోపీచంద్ కి 28వ సినిమా
- సంపత్ నంది దర్శకత్వం
- తమన్నా కథానాయిక
సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా తమన్నా కనిపించనుంది. ఈ ఇద్దరిపై బోయపాటి శ్రీను క్లాప్ ఇవ్వగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఇది గోపీచంద్ కి 28వ సినిమా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.