తిరుచ్చి లలితా జ్యుయెలరీ దుకాణంలో భారీ దోపిడీ
- గోడకు కన్నం వేసిన దొంగలు
- రూ.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాల చోరీ
- సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
చోరీకి ముందు దొంగలు రెక్కీ చేసినట్టు నిర్ధారించారు. సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ దోపిడీలో ముగ్గురు దొంగలు పాల్గొన్నట్టు తెలుసుకున్నారు. వారు ముసుగులు ధరించి ఉన్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు షురూ చేశారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలిస్తున్నారు.