దూకుడు మీదే వున్న నాగశౌర్య
- 'నర్తనశాల'తో పరాజయం
- సొంత బ్యానర్లో మరో సినిమా
- కొత్తదనంపై ప్రత్యేక దృష్టి
మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ ను అన్బు - అరివు డిజైన్ చేశారు. 'కేజీఎఫ్' సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన ఈ ఇద్దరూ పనిచేస్తోన్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ ఇద్దరూ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ ను ఇటీవలే వైజాగ్ లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను అక్టోబర్లో మొదలెట్టనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పోసాని ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.