తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్
- వెంకటేశ్ తాజా చిత్రంగా 'వెంకీమామ'
- ముగింపు దశకి చేరుకున్న చిత్రీకరణ
- హార్స్ రైడింగ్ నేపథ్యంలో నెక్స్ట్ మూవీ
ఆ మధ్య తరుణ్ భాస్కర్ ఒక విభిన్నమైన కథాంశాన్ని వెంకటేశ్ కి వినిపించడం .. అది సురేశ్ బాబుకి కూడా నచ్చడం జరిగిపోయిందట. హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 'పెళ్లి చూపులు' తరువాత తరుణ్ భాస్కర్ చేసిన 'ఈ నగరానికేమైంది' అంచనాలను అందుకోలేకపోయిందనే సంగతి తెలిసిందే.