హిందీలో భారీస్థాయిలో 'సైరా' విడుదల
- భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన 'సైరా'
- ఒకే రోజున ఐదు భాషల్లో విడుదల
- ప్రచార కార్యక్రమాలకి సన్నాహాలు
హిందీలో ఈ సినిమాను 1500 స్క్రీన్లలో విడుదల చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీస్థాయిలో చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చరణ్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేయిస్తున్నాడట. త్వరలో ముంబై .. చెన్నై .. బెంగళూరు .. కేరళ ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకానున్నాయని చెబుతున్నారు. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏ ప్రాంతంలో ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.