నాకు అవకాశాలు రాకపోవడానికి అదో కారణమై ఉండొచ్చు: హీరో రోహిత్
- నాకు నటన అంటే ఇష్టం
- నలుగురిలో త్వరగా కలవలేను
- అవకాశాలు అడగలేనన్న రోహిత్
"మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం .. తెరపై కనిపించడమంటే ఇష్టం. అందువల్లనే సినిమాల్లోకి వచ్చాను. అయితే నేను సెట్ కి వెళ్లి నాకు సంబంధించిన షూటింగు పూర్తికాగానే వచ్చేస్తాను .. అందరిలో అంత త్వరగా కలవలేను. 'చిత్రపరిశ్రమలో నలుగురితో కలవాలి .. నలుగురితో తిరగాలి .. మాట్లాడాలి అప్పుడే అవకాశాలు వస్తాయి' అని సన్నిహితులు చెబుతుంటారు. కారణం లేకుండా నేను ఎవరినీ కలవలేను .. అవకాశాలు అడగలేను .. నాలోని మైనస్ అదేనని నేను అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.