సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగశౌర్య కొత్త చిత్రం
- సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి 8వ సినిమా
- దర్శకురాలిగా లక్ష్మీ సౌజన్య పరిచయం
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాను నాగశౌర్య హీరోగా ప్లాన్ చేసింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో .. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా 'లక్ష్మీ సౌజన్య' దర్శకురాలిగా పరిచయమవుతోంది. ప్రస్తుతం ఇతర తారాగణం .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే ఆ వివరాలను ప్రకటించనున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా తెలియపరిచారు.